ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవల విస్తరణ
NEWS Sep 02,2025 12:04 pm
టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన ప్రకటన చేశారు. ఐటీ కారిడార్లో ప్రజారవాణా సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఐటీ సంస్థలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు ఇస్తామన్నారు. త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఐటీ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు ఎండీ.