6న హైదరాబాద్ కు అమిత్ షా రాక
NEWS Sep 02,2025 10:53 am
ఈనెల 6న హైదరాబాద్ కు రానున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా . భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద వినాయక నిమజ్జనం జరిగే శోభాయాత్రలో పాల్గొంటారు.