వైఎస్సార్ కు జగన్ ఘనంగా నివాళి
NEWS Sep 02,2025 09:24 am
వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతీ రెడ్డి, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రజా నాయకుడికి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారని పేర్కొన్నారు జగన్ రెడ్డి.