సంక్షేమం ఏపీ సర్కార్ లక్ష్యం
NEWS Sep 02,2025 08:20 am
సంక్షేమం, అభివృద్ధే తమ కూటమి సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఇప్పటికే ఐటీ, లాజిస్టిక్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. కమలాపురం జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అక్కడికక్కడే వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. తనకు నేరుగా తెలియ చేయాలని సూచించారు లోకేష్.