బాబూ అన్నమయ్య ప్రాజెక్టుపై మౌనమేల..?
NEWS Sep 02,2025 07:54 am
అన్నమయ్య ప్రాజెక్టు 5 ఏళ్లవుతున్నా ఎందుకని పునరుద్దరించడం లేదంటూ ప్రశ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. గతంలో జగన్ హడావుడి చేశాడని, తట్టెడు మట్టి వేయలేదన్నారు. పవర్ లోకి వచ్చిన ఏడాది లోపే ప్రాజెక్టు కడతామన్న సీఎం చంద్రబాబు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. రాజంపేటకు రెండు సార్లు వచ్చినా అతీ గతీ లేదన్నారు. రూ. 340 కోట్లతో మరమ్మతులు చేస్తామని చెప్పిన సీఎం ఒక్క పైసా కూడా విదిల్చిన పాపాన పోలేదన్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేయడం దారుణమన్నారు.