కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర
NEWS Sep 02,2025 07:19 am
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు. వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. అందుకే రెండవ టర్మ్ లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని చె్శారు. హరీష్ రావు, సంతోష్ వల్లనే కెసిఆర్ కి అవినీతి మరకలు అంటాయన్నారు. తనపై కుట్రలు చేసినా సహించానని, కానీ తన తండ్రిపై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేక పోతున్నానని వాపోయారు. ఆ ఇద్దరి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని మండిపడ్డారు.