మైసూరు తరహాలో ఏపీలో దసరా వేడుకలు
NEWS Sep 02,2025 07:14 am
దసరా వేడుకలను మైసూరు తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు విజయవాడ ఉత్సవ్ పేరుతో సన్నాహాలు ప్రారంభించింది. నగరంలోని నదీ పరివాహకం సహా అన్ని ప్రాంతాల్లోనూ సినీ, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, జలక్రీడలు, హెలీకాఫ్టర్ రైడ్, దుకాణ సముదాయాల స్టాళ్లు, మిరుమిట్లు గొలిపే డ్రోన్ల ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి.