అన్నాభావు సాఠె జయంతి వేడుకలు
NEWS Sep 01,2025 07:14 pm
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాంగ్ సమాజ్ కమిటీ సాహి త్య సామ్రాట్ అన్నాభావు సాఠె 105వ జయంతి వేడుక లు ఘనంగా జరిపింది. అన్నా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాంగ్ కులానికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు మోహాలే దత్త మాంగ్ డిమాండ్ చేశారు. గురుకులాల్లో సీట్లు కేటాయిం పు, జిల్లా కేంద్రంలో మాంగ్ సమాజ్ భవనం నిర్మాణం చేపట్టాలని కోరారు. దత్తరాజ్ గాయక్వాడ్, రాము మాంగ్, సతీష్ పద్మశాలి, బాలాజీ మాంగ్ పాల్గొన్నారు.