నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు
NEWS Sep 01,2025 06:53 pm
హైదరాబాద్: పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు బ్రిటన్ వైద్యులతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొ. బీరప్ప తెలిపారు. మంగళ, గురు, శుక్రవారాల్లో ఉ. 8 నుంచి సా. 4 వరకు సంప్రదించవచ్చని, పాత రిపోర్టులు తీసుకు రావాలని తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 21 వరకు నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులను పరీక్షించి అవసరమైన వారికి సర్జరీ చేస్తారు.