రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు
NEWS Sep 01,2025 10:00 pm
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.1,05,000 దాటగా, వెండి కిలో ధర రూ.1,26,000కు చేరువైంది. ఈ భారీ పెరుగుదలతో వినియోగదారులు, ముఖ్యంగా ఆభరణాల కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిణామాలే ఈ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.