కవిత కొత్త పార్టీ పెడుతున్నారా?
NEWS Sep 01,2025 09:57 pm
బీఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి కవిత పీఆర్వోను బీఆర్ఎస్ తొలగించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త పార్టీకి కవిత రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాగానే కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేపు కవితపై బీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.