ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవితకు కౌంటర్ ఇస్తూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్‌రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ.. పేర్కొన్నారు. నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ.. X వేదికగా రాసుకొచ్చారు.