కాంగ్రెస్ వ్యతిరేకంగా బిఆర్ఎస్ బైక్ ర్యాలీ
NEWS Sep 01,2025 09:47 pm
మణుగూరు: కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా తప్పుబడుతూ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు. ఆయన పార్టీ నాయకులతో కలిసి మణుగూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కావాలనే సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.