టీటీడీ మాజీ చైర్మన్ భూమన హాట్ కామెంట్స్
NEWS Sep 01,2025 04:52 pm
తిరుమల సన్నిధానం హోటల్ లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రూ.2 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని, సీఎంఓ నుంచి దందా నడిచిందని మండిపడ్డారు. గతంలో సన్నిదానం క్యాంటీన్ ను అద్దె కట్టలేదని మూసేశారని అన్నారు. 2024 డిసెంబర్ లో తిరిగి ప్రారంభించాలని జీవో ఇచ్చారన్నారు. రూ.2 కోట్ల 85 లక్షల అద్దె బాకీ ఉంటే రూ.కోటి 24 వేలు మాత్రమే కట్టారని పేర్కొన్నారు. చైర్మన్ బీఆర్ నాయడు దగ్గరుండి క్యాంటీన్ ని ప్రారంభించారని, ఓ హోటల్ కు రూ. 2 కోట్ల లాభం చేకూర్చాడని ధ్వజమెత్తారు.