తెలంగాణలో భారీ వర్షాలు
NEWS Sep 01,2025 04:47 pm
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ). రెండు రోజుల పాటు ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.