28న 10 వేల మందితో బతుకమ్మ వేడుకలు
NEWS Sep 01,2025 04:36 pm
మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22 నుంచి 24 వరకు జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుపుతామన్నారు. ట్యాంక్ బండ్ దగ్గర సెప్టెంబర్ 27న బతుకమ్మ కార్నివాల్ ఏర్పాటు చేశామన్నారు. 29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీ వేడుకలు జరుగుతాయని వెల్లడించారు.