తెలంగాణ తల్లికి గోదావరి జలాభిషేకం
NEWS Sep 01,2025 09:48 pm
పెద్దపల్లి: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి నీటితో జలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి BRS, BRSV, BRS యూత్ నాయకులు సుందిళ్ల బరాజ్ వద్దకు బైక్ ర్యాలీగా వెళ్లి గోదావరి జలాలను తీసుకువచ్చి, జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొన్నారు.