సీఎం పర్యటన విజయవంతం చేయండి
NEWS Sep 01,2025 09:48 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీ వద్ద కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం మీడియాతో మాట్లాడారు. ఈనెల 3న సీఎం రేవంత్ పర్యటించనున్నారని తెలిపారు. సీఎం పర్యటన విజయవంతం కావడానికి ప్రతీ కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. పినపాక మండలం నుండి మాత్రమే సుమారు 5000 మంది సభకు హాజరయ్యేలా భారీ జన సమీకరణ చేపడతామని రామనాథం స్పష్టం చేశారు.