హరీశ్ రావుతో టచ్ లో ఉన్నా : ఎమ్మెల్యే
NEWS Sep 01,2025 03:29 pm
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఉన్నట్టుండి మాట మార్చాడు. తాను పార్టీ మార లేదన్నాడు. ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఇప్పుడు బాధపడుతున్నాని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే అద్దె ఇంట్లో ఉండే ఫీలింగ్ వస్తుందోన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు అంటే తనకు గౌరవమని, ఆయనతో తాను టచ్ లో ఉన్నానని చెప్పారు.