కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి: రామయ్య
NEWS Sep 01,2025 10:33 pm
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు.లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచినట్లు గుర్తు చేశారు. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ రామాంజనేయులు పాల్గొన్నారు.