అదుపు తప్పిన కారు ముళ్ల పొదల్లోకి
NEWS Sep 01,2025 04:38 pm
సిద్దవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి భాకరాపేట గ్రామ సమీపాన సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కడపకు చెందిన వ్యక్తులు రేణిగుంటకు కారులో వెళ్తుండగా ఆవు అడ్డం రావడంతో కారు అదుపు తప్పి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు.