రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
NEWS Sep 01,2025 10:34 pm
కొండపి మండలం అనకర్లపూడి శాంతినికేతన్ హైస్కూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపి నుంచి చిలంకూరు వెళ్తున్న చేజర్ల గంగాధర్ బస్సు దాటే సమయంలో రోడ్డు పక్కనున్న గుంటలో స్కిడ్ కావడంతో, ఒంగోలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొండపి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.