ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
NEWS Sep 01,2025 02:46 pm
దుబాయ్ వేదికగా జరిగిన గామా 2025 అవార్డుల కార్యక్రమంగా ఘనంగా జరిగింది. పుష్పకు అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడిగా బన్నీ, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ చిత్రంగా పుష్ప -2 , ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఎంపికయ్యారు. వీరంతా అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ నటిగా మీనాక్షి ఎంపికైంది. అవార్డులను కోదండ రాం రెడ్డి, బి. గోపాల్, కోటి తో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది.