కాళేశ్వరం కమిషన్ రిపోర్టు తప్పుల తడక
NEWS Sep 01,2025 02:07 pm
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా అబద్దమని, తప్పుల తడక అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం దారుణమన్నారు. ఆ కమిషన్ నిలవదని పేర్కొన్నారు. తాజాగా ఈటల చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కాగా కాళేశ్వరం కట్టిన సమయంలో తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు.