స్థానికత అంశంపై సంచలన తీర్పు
NEWS Sep 01,2025 11:50 am
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్థానికత (లోకల్) అనే అంశంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టి వేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానికత పై ఇచ్చిన జీవో 33 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. దీంతో లోకల్ రిజర్వేషన్లు పొందాలంటే 9 వ తరగతి నుంచి 12 వరకు చదవాల్సిందేనని స్పష్టం చేసింది.