చైనాలో పుతిన్ తో మోదీ భేటీ
NEWS Sep 01,2025 11:40 am
చైనాలో జరుగుతున్న షాంఘై ఆర్థిక సదస్సుకు పలు దేశాలు హాజరయ్యారు. రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నిన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇవాళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆలింగనం చేసుకున్నారు. కాగా భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. 50 శాతం సుంకాలు విధించారు.