ఆపరేషన్ సింధూర్ థీమ్ గణేష్ మండపం
NEWS Sep 01,2025 10:35 pm
కామారెడ్డి: విద్యానగర్ కాలనీలో వాయుసేన ఆధ్వర్యంలో 'ఆపరేషన్ సింధూర్' థీమ్‌తో ప్రత్యేక గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళిగా ఈ మండపాన్ని అలంకరించారు. పహెల్గావ్‌లో జరిగిన ఆపరేషన్ సింధూర్ జ్ఞాపకార్థం రూపొందించిన ఈ మండపం భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో కేవలం రూ.50కే పావుకిలో వెండి గణపతి విగ్రహం బహుమతిగా అందజేయనున్నారు. రాహుల్ గౌడ్, ధీరన్ భోగి, వీరల్ భోగి, సాయికుమార్ సాయి వరుణ్, మునీశ్వర్, హృదయ్, అఖిల్ పాల్గొన్నారు.