శాసన మండలిలో బీసీ బిల్లు ఆమోదం
NEWS Sep 01,2025 11:25 am
తెలంగాణ శాసన మండలిలో సోమవారం బీసీ బిల్లు ఆమోదం పొందింది. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల నిరసన మధ్య చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గులాబీ ఎమ్మెల్సీలు. ఇది పూర్తిగా అనైతికమని పేర్కొన్నారు.