సీబీఐకి అప్పగించడంపై కేటీఆర్ ఫైర్
NEWS Sep 01,2025 11:21 am
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని అందుకే దీనిపై విచారణ చేపట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీ సీబీఐని ప్రతిపక్షాల నిర్మూలన సెల్‌గా అభివర్ణించారని గుర్తు చేశారు. ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా అంటూ విమర్శలు గుప్పించారు. తమపై ఎన్ని కుట్రలు పన్నినా తాము న్యాయ పరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.