కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ
NEWS Sep 01,2025 11:17 am
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. లంచ్ మోషన్ పిటిషన్‌ను నిరాకరించింది కోర్టు. సెప్టెంబర్ 2న మంగళవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. శాసన సభలో రాష్ట్ర ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈ మేరకు కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా విచారించేందుకు సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై సవాల్ చేస్తూ హరీశ్ రావు కోర్టును ఆశ్రయించారు.