గణేశ్ నిమజ్జన ప్రమాదాలపై సీఎం విచారం
NEWS Sep 01,2025 10:53 am
రాష్ట్రంలో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై సిఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వెస్ట్ గోదావరి జిల్లా తూర్పుతాళ్ళ గ్రామంలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి జరిగింది. ట్రాక్టర్ దూసుకు పోయిన ఘటనలో నలుగురు మృతి చెందారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అల్లూరి జిల్లా పాడేరు చింతలవీధి జంక్షన్ లో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఇద్దరు మృతి చెందడం పట్ల ఆవేదన చెందారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.