కాళేశ్వరం కేసు సీబీఐకి : సీఎం
NEWS Sep 01,2025 09:54 am
సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి . అసెంబ్లీ సాక్షిగా ఆయన కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పేరుతో కల్వకుంట్ల కుటుంబం కోట్లాది రూపాయలు సంపాదించిందని ఆరోపించారు. వారంతా జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.