ఆఫ్గాన్ లో భూకంపం 250 మంది దుర్మరణం
NEWS Sep 01,2025 09:50 am
ఆఫ్గనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. మహా విషాదం చోటు చేసుకుంది. ఏకంగా 250 మందికి పైగా భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు. ఈ ఘటనలో మరో 500 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆఫ్గాన్ కు సాయం చేస్తామని వెల్లడించింది.