మరో మూడు రోజులు భారీ వర్షాలు
NEWS Sep 01,2025 09:17 am
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొందని, దీని ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి , విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూగో, పగో, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడుతాయని తెలిపింది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.