ఎస్‌సీవో సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీ
NEWS Aug 31,2025 10:00 pm
తియాంజిన్ (చైనా): షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య ఉన్నత స్థాయి భేటీ జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం కొనసాగించాలని నిర్ణయించారు. ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై ఫలప్రదమైన చర్చలు జరగ్గా, 2026 బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారు.