11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
NEWS Aug 31,2025 09:48 pm
జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు టౌన్ ఇన్స్పెక్టర్ పీ. కరుణాకర్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.95,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.