సేవాదళ్ జాతీయ జెండా ఆవిష్కరించిన జువ్వాడి
NEWS Aug 31,2025 04:21 pm
మెట్‌పల్లిలో అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ సంప్రదాయం ప్రకారం నెల చివరి ఆదివారం నిర్వహించే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం బస్టాండ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు నాయిని సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పట్టణ కాంగ్రెస్, యువ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.