పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించిన పోలీసులు
NEWS Aug 31,2025 09:53 pm
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 6న జరగబోయే గణేష్ నిమజ్జనం పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. సిఐ సురేష్ బాబు, ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని మతాల పెద్దలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నమ్మకుండా, వాటిని వెంటనే పోలీసులకు తెలియజేయాలని, అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.