రేపటి "ఛలో హైదరాబాద్" కు తరలిరండి
NEWS Aug 31,2025 04:25 pm
జగిత్యాల: రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ నుంచి అమలవుతున్న CPSను రద్దు చేసి, OPSను అమలు చేయాలని PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో CPS రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 22 నెలలు గడిచినా స్పందన చూపలేదని విమర్శించారు. రేపు జరగనున్న "పెన్షన్ విద్రోహ దినం" సందర్భంగా PRTU TS ఆధ్వర్యంలో నిర్వహించే "ఛలో హైదరాబాద్ మహాధర్నా"లో ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొని CPS అంతానికి పోరాడాలని పిలుపునిచ్చారు.