'దేశంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తాం'
NEWS Aug 31,2025 04:26 pm
HYD: వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కేవలం 55 రోజుల్లో 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించ బోతున్నట్లు ప్రకటించారు . ఒక్కో స్కూల్‌ను రూ.200 కోట్ల ఖర్చుతో 25 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామన్నారు.