కాళేశ్వరం తెలంగాణకు గుదిబండ
NEWS Aug 31,2025 06:21 pm
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ఏడాదికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ఐదేళ్లకు కలిపి 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారంటూ మండిపడ్డారు. 162 టీఎంసీల్లో 32 టీఎంసీలు సముద్రంలోకి వదిలారని ఫైర్ అయ్యారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఉపయోగపడింది కేవలం 101 టీఎంసీలు మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.