నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు
NEWS Aug 31,2025 07:43 pm
వినాయక చవితి ఉత్సవాల భాగంగా ఐదవ రోజు గణనాథుడు ఆదివారం నిమజ్జనానికి బయలుదేరాడు. సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో ప్రతిష్టించిన గణనాథుడికి నాలుగు రోజులుగా విశేష పూజలు నిర్వహించారు. గ్రామస్తులు అందరూ కలసి రంగులు చల్లుకుంటూ, ఆనందోత్సాహాలతో నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తులు కర్పూరం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.