తెలంగాణ సర్కార్ కు థ్యాంక్స్ : జాజుల
NEWS Aug 31,2025 04:35 pm
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు బిల్లు చట్టం చేసిన సందర్భంగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ . సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం సీలింగును ఎత్తివేస్తూ అసెంబ్లీలో పంచాయతీ చట్ట సవరణ బిల్లును ఆమోదించడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి , సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ వాకటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాసలకు ధన్యవాదాలు తెలిపారు.