ఇబ్రహీంపట్నం గ్రామానికి MP నిధులు
NEWS Aug 31,2025 04:36 pm
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుండి ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైన రూ.10,35,000/- నిధులకు భూమి పూజ నిర్వహించిన బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు బాయి లింగారెడ్డి . ఇబ్రహీంపట్నం గ్రామానికి రెండు ముదిరాజ్ సంఘాలకు రూ.5 లక్షలు, గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షలు, గ్రామ పంచముఖి హనుమాన్ ఆలయానికి రూ.1.35 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీధర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు సుంచురధీర్, వెంకటేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు సతీష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.