రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం
NEWS Aug 31,2025 04:39 pm
ప్రధాని మోదీతో పాటు ఆయన తల్లిని చులకన చేస్తూ కామెంట్స్ చేసిన ఎంపీ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను మెట్ పల్లి పాత బస్టాండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. తక్షణమే మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ , అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ , బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికేల నవీన్ , బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకేటి విజయ్ , మర్రి నందకిషోర్, పట్టణ ఉపాధ్యక్షులు బోడ్ల నాగేష్, జుంగుల అనిల్, అశోక్ ,తోగిటి రమేష్ , బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి బొడ్ల నరేష్ మరంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.