ఉధృతంగా గోదావరి వరద ప్రవాహం
NEWS Aug 31,2025 02:54 pm
గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. అంతకంతకూ వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 47.9 అడుగుల నీటిమట్టంకు చేరింది. వళేశ్వరం వద్ద ఇన్,ఔట్ ఫ్లో 10.92 లక్షల క్యూసెక్కుల వద్ద ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.