ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు తప్పిన ప్రమాదం
NEWS Aug 31,2025 11:57 am
ఢిల్లీ నుంచి ఇండోర్ కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి 90 మందికి పైగా ప్రయాణీకులతో బయలు దేరింది. ఉన్నట్టుండి ఫ్లైట్ ఇంజిన్ లో మంటలు రావడంతో వెంటనే పైలట్ గుర్తించాడు. ఈ విషయాన్ని కంట్రోల్ రూంకు తెలియ చేయడంతో వెంటనే తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానాలు సాంకేతిక సమస్యలతో సతమతం అవుతున్నాయి.