మంగళవారం చిట్వేల్‌లో పవన్ జన్మదిన వేడుకలు
NEWS Aug 31,2025 07:42 pm
చిట్వేల్‌లో జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే కళ్యాణ మండపంలో మంగళవారం జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మంత్రి మండపల్లి రాంప్రసాద్, రైల్వేకోడూరు టిడిపి ఇన్‌ఛార్జ్ ముక్కారూపానంద రెడ్డి, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, బీజేపీ సాయి లోకేష్, జనసేన తాతంశెట్టి నాగేంద్రతో పాటు స్థానిక నేతలు హాజరుకానున్నారు. వేడుకను విజయవంతం చేయాలని జనసేన నాయకుడు మాదాసు నరసింహ కార్యకర్తలు, అభిమానులు, ఎన్డీఏ నేతలను పిలుపునిచ్చారు.