చిట్వేల్ మండలంలో బొప్పాయి రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దళారులు సిండికేట్ ఏర్పరచి కిలో ధరను ₹5కే కుదించి రైతులను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. కలెక్టర్ పది రూపాయలకు అమ్మాలని ఆదేశించినా పట్టించు కోక పోవడంతో ముగ్గురు రైతులు పురుగు మందు సీసాలతో ఆత్మహత్య యత్నం చేశారు.