రాజంపేటకు రానున్న చంద్రబాబు
NEWS Aug 31,2025 09:44 am
ఏపీ సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 1న చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా రాజంపేట మండలం బోయనపల్లిలో లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తారు. అనంతరం తాళ్లపాకకు వెళతారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కూటమి సర్కార్ వచ్చాక ప్రతి నెలా ఒకటో తేదీనే నేరుగా పెన్షన్ దారులకు పెన్షనలు అందజేస్తున్నారు.